ప్రో-కబడ్డీని తలపించిన మహిళా క్రీడోత్సవాలు

ప్రో-కబడ్డీని తలపించిన మహిళా క్రీడోత్సవాలు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత రెండు రోజులుగా నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కొనసాగుతున్న మహిళా క్రీడోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. నర్సంపేట గ్రామీణ మరియు పట్టణానికి చెందిన టీమ్స్ యొక్క కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ను స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసక్తికరంగా తిలకించారు. ప్రో-కబడ్డీని తలపించిన మహిళా క్రీడోత్సవాలుఈ క్రీడల్లో ఒక్కో మండలంలో పోటాపోటీగా సుమారు 40 టీంలు పాల్గొన్నాయి. మొత్తంగా అన్ని మండలాలు కలిపి 250 కు పైగా టీంలు పాల్గొని కో-కో, కబడ్డీ, రన్నింగ్, తగ్గాఫర్, లతో పాటు ఇండోర్ గేమ్స్ కూడా నిర్వహించారు. ఆయా మండలాల్లో పైనల్ కు చేరుకున్న జట్లను మరో రెండు, మూడు రోజుల తర్వాత డివిజన్ స్థాయిలో ఆడించడం జరుగుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ క్రీడల్లో పురుషుల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారిలోని క్రీడాశక్తిని, ప్రతిభను, కనబర్చిన మహిళా సోదరీ మనులందరిని ఎమ్మెల్యే అభినందించారు.ప్రో-కబడ్డీని తలపించిన మహిళా క్రీడోత్సవాలుఈ క్రీడోత్సవాలును విజయవంతం చేసినందుకు వారికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆయా మండలాల్లో ఎంతో కష్టపడి మహిళలను ప్రోత్సహించి వారిని క్రీడల్లో పాల్గొనేందుకు ఎంతో కృషి చేసిన నిర్వాహకులు, మహిళా నాయకురాళ్ళు, ఏపీఎంలను పెద్ది సుదర్శన్ రెడ్డి అభినందించారు. రెండు రోజులుగా ఎంతో శ్రద్ధ, ఓపికతో ఆటలాడించిన పీ.ఈ.టీ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మరియు ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో ఫైనల్ కు చేరుకున్న జట్లకు అభినందనలు తెలిచేశారు. ఇదే స్ఫూర్తితో డివిజన్ స్థాయి ఫైనల్ గేమ్స్ ను కూడా విజవంతం చేయాలని ఎమ్మెల్యే క్రీడల్లో పాల్గొన్న మహిళలను కోరారు.