2022 టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్

2022 టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్స్పోర్ట్స్ డెస్క్ : టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. యూఏఈ వేదికగా జరిగిన గత టీ 20 ప్రపంచకప్ లో టీం ఇండియా ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సారి ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రపంచకప్ లో టీమిండియా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 2022 టీ 20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి తొలి రౌండ్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి.

అక్టోబర్ 22న సూపర్ -12 స్టేజ్ మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ లో ప్రపంచకప్ నిర్వహిస్తున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పోటీపడనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబర్ 23 న ఆడుతుంది. ఈ సారి కూడా ఈ మెగా టోర్నీలో భారత్ తలపడే తొలి ప్రత్యర్థి దాయాది పాకిస్తానే కావడం గమనార్హం. అయితే గతంలో కోహ్లీ సారథ్యంలో బరిలో దిగిన భారత జట్టు ఈ సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుంది.