ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆసిస్ చేతిలో భారత్ ఓటమి

ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆసిస్ చేతిలో భారత్ ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మహిళలు చరిత్ర సృష్టించారు. అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించారు. శనివారం నాడు భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఈ ఘనత సాధించింది. విజయంతో ఆసీస్ జట్టు సెమీస్ చేరడం ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఆసిస్ చేతిలో భారత్ ఓటమిఓపెనర్లు స్మృ తి మందాన ( 10 ), షెఫాలీ వర్మ ( 12 ) నిరాశపరిచారు. అయితే యాస్తికా భాటియా ( 59 ), కెప్టెన్ మిథాలీ రాజ్ ( 68 ), హర్మన్ ప్రీత్ కౌర్ ( 57 నాటౌట్ ) జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత రిచా ఘోష్ ( 8 ), స్నేహ్ రాణా ( 0 ) నిరాశపరిచినా, పూజా వస్త్రాకర్ ( 34 ) చివరిలో మెరుపులు మెరిపించింది. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు రచెల్ హేనెస్ ( 43 ), అలిస్సా హేలీ ( 72 ) అద్భుతమైన ఆరంభం అందించారు. ఈ జోడీని వస్త్రాకర్ విడగొట్టింది. ఆమె బౌలింగ్ లో రచెల్ అవుటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ ల్యానింగ్ ( 97 ) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఎలిసీ పెర్రీ ( 51 బంతుల్లో 28 ) టెస్టు తరహా బ్యాటింగ్ కనబరిచినా, చివరిలో బెథ్ మూనీ ( 30 ) నాలుగు ఫోర్లతో జట్టును విజయానికి చేర్చింది. భారత బౌలర్లలో వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్నేహ్ రాణా , మేఘనా సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు మరో 3 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.