రెండో వన్డేలో ఆస్ట్రేలియా విక్టరీ

రెండో వన్డేలో ఆస్ట్రేలియా విక్టరీ

రెండో వన్డేలో ఆస్ట్రేలియా విక్టరీwarangal times, స్పోర్ట్స్ డెస్క్ : విశాఖపట్టణంలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (66) ట్రావిస్ హెడ్ (51) అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరూ టీ 20 తరహాలో బ్యాటింగ్ చేయడంతో ఆసీస్ మరో 234 బంతులు ఉండగానే టార్గెట్ ను ఛేదించింది.

తొలి వన్డేలో గెలిచి ఊపు మీదున్న భారత్ కు షాక్ తగిలింది. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ వశం చేసుకోవాలనుకున్న టీమిండియా ఆశలపై ఆసీస్ నీళ్లు చల్లింది. పేసర్లు స్టార్క్, అబాట్ చెలరేగడంతో భారత్ ను 117 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా, స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ మిచెల్ మార్ష్ రెండో వన్డేలోనే అదే జోరు కొనసాగించాడు. ఎడాపెడా బౌండరీలు కొడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా వేసిన 8వ ఓవర్ లో 3 సిక్స్ లు బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన మార్ష్ 29 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్స్ లతో 50 కి చేరవయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా అర్ధ శతకం కొట్టడంతో ఆస్ట్రేలియా 11 ఓవర్లకే మ్యాచ్ ముగిచింది.