వివేకా హత్య కేసుపై..నాని సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్య కేసుపై..నాని సంచలన వ్యాఖ్యలు

వివేకా హత్య కేసుపై..నాని సంచలన వ్యాఖ్యలువరంగల్ టైమ్స్, అమరావతి : వైఎస్‌ వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌ చోటు చేసుకుంటూనే ఉంది. ఐతే వైఎస్‌ వివేకా హత్య కేసుపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా భార్య, కుమార్తె, అల్లుడిని కూడా విచారించాల్సిందేనన్నారు పేర్నినాని. టీడీపీ విడుదల చేసిన పుస్తకంపై పేర్ని నాని విమర్శలు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో ప్రతిపక్షం విషప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు పేర్నినాని.

వివేకా హత్య సమయంలో ఎవరి ప్రభుత్వం ఉందని ప్రశ్నించారు. అప్పుడు టీడీపీ నేతలు ఏం చేశారు. వివేకా భార్య, కుమార్తె, అల్లుడిని ఎందుకు విచారించలేదని నిలదీశారు. సీఎం జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. అచ్చెన్నాయుడికి బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అవినాష్‌రెడ్డిపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు అప్పుడు ఎందుకు నిందితుడిగా చేర్చలేదని ప్రశ్నించారు పేర్ని నాని.