నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

నేడు శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు విడుదల

వరంగల్ టైమ్స్, తిరుమల : వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను టీటీడీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకి ‘Tirupatibalaji.AP.Gov.in’ అనే వెబ్ సైట్ తో పాటు ‘TT Devasthanams’ మొబైల్ యాప్ లో ఈ కోటాను విడుదల చేయనున్నారు.

ఏప్రిల్, మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లు కూడా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు. అలాగే మార్చి నెల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవా టికెట్ల కోటాను కూడా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.