వందేభారత్ టికెట్ ధరలు ఎంతంటే..!

వందేభారత్ టికెట్ ధరలు ఎంతంటే..!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వందేభారత్ టికెట్ ధరలను దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. చైర్ కార్ లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ కి రూ.520, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కి రూ.1005 వసూలు చేయనున్నారు. చైర్ కారులో సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు రూ.750, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ.905, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి రూ.1365, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు రూ.1665 వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అదే విశాఖ పట్టణం నుంచి సికింద్రాబాద్ కు టికెట్ ధర రూ.1720 నిర్ణయించినట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఆహారం వద్దనుకుంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి పూర్తిగా అందుబాటులోకి రానున్న వందే భారత్ కోసం సీట్ల రిజర్వేషన్ ను అధికారులు శనివారం ప్రారంభించారు. సాయంత్రం వరకే మంగళ, బుధవారం వరకే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పారు.వందేభారత్ టికెట్ ధరలు ఎంతంటే..!విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ( 20833) ప్రతీ రోజు ఉదయం 5.55 గంటలకు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ( 20834) ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యే ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో 16 బోగీలున్నాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, 2 ఎగ్జిక్యూటివ్ చైర్ కారు బోగీలున్నాయి. వీటిలో 1128 మంది ప్రయాణించవచ్చు. మెట్రో రైలు తరహాలో స్లైడింగ్ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం మినహా వారంలో 6 రోజులు ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య పరుగులు పెడుతుంది. దీని పూర్తి స్థాయి సర్వీసులు జనవరి 16 నుంచి ఉంటాయని తెలిపారు.