నేపాల్ లో రన్ వే పై కూలిన విమానం
వరంగల్ టైమ్స్, పొఖారా : నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పొఖారా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్ వే పై విమానం కుప్పకూలింది. విమానం కుప్పకూలడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు.విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మొత్తం 72 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.32 మంది మృతదేహాలను ఇప్పటివరకు వెలికి తీశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.