సెట్విన్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన చీఫ్ విప్ దాస్యం

సెట్విన్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన చీఫ్ విప్ దాస్యం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగులు స్వయం ఉపాధి పొంది ఎవరి కాళ్లపై వారు నిలబడాలన్నా ముఖ్య ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో ఏర్పాటైనవే సెట్విన్ శిక్షణ కేంద్రాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సెట్విన్ శిక్షణ కేంద్రం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. సమైక్య రాష్ట్రంలో సెట్విన్ సంస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని చీఫ్ విప్ అన్నారు.సెట్విన్ శిక్షణ కేంద్రాలను సందర్శించిన చీఫ్ విప్ దాస్యంసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో హనుమకొండ నగరంలో సెట్విన్ శిక్షణ సంస్థని మరింత అధునాతన శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందు కృషి చేస్తామని దాస్యం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధితో పాటు ఉద్యోగాల కల్పనకు సెట్విన్ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ జంట నగరంతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు సుమారు 24 స్వంత కేంద్రాలు, 60 ఫ్రాంచైజ్ ల ద్వారా 47 వృత్తి నైపుణ్య కోర్స్ లలో నిరుద్యోగ యువతకు శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికి పైగా సెట్విన్ సంస్థ ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మారుతున్న పరిస్థితులకు, ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా సెట్విన్ ఆధ్వర్యంలో 1.బయోమెడికల్ ఇంజినీరింగ్ ఎక్వీప్మెంట్ సర్వీసింగ్, 2.అఫ్తాల్మాలజీ ఎక్వీప్మెంట్ సర్వీసింగ్ ,3. పీసీబీ రిపేర్ టెక్నీషియన్, 4.ఫైర్అలారం ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెన్స్ కోర్స్ లను శిక్షణ కేంద్రంలో అందుబాటులో ఉంచారని చీఫ్ విప్ చెప్పారు.

సెట్విన్ శిక్షణ విభాగంలో డీటీపీ, ఎంఎస్ ఆఫీసు, కంప్యూటర్ అకౌంటెన్సీ ప్యాకేజీ, పీజీ డిప్లొమా కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డిప్లోమా ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్, సీ, సీ ప్లస్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సులు, రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషన్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, టైలరింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, జిగ్‌జాగ్ మగ్గం, ప్రీప్రైమరీ టీచింగ్ తదితర విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు.సెట్విన్ శిక్షణ సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ రావుకి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభినందనాలు.