రాజస్తాన్ పై గుజరాత్ టైటాన్స్ విక్టరీ

రాజస్తాన్ పై గుజరాత్ టైటాన్స్ విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022లో నాలుగో విక్టరీని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో చిత్తుచేసిన టైటాన్స్ మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్ ), అభినవ్ మనోహర్ ( 28 బంతుల్లో 43) తో పాటు చివరిలో మిల్లర్ ( 14 బంతుల్లో 31నాటౌట్ ) రాణించడంతో 20 ఓవర్లలో 192/4 భారీ స్కోరు చేసింది.రాజస్తాన్ పై గుజరాత్ టైటాన్స్ విక్టరీరాజస్తాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ (1/51), చహల్ (1/32), పరాగ్ (1/12) చెరో వికెట్ తీశారు. ఛేజింగ్ లో ఫెర్గుసన్ (3/23), ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న యశ్ దయాల్ ( 3/40) అదరగొట్టడంతో 20 ఓవర్లలో 155/9 స్కోరు చేసిన రాజస్తాన్ ఓడిపోయింది. బట్లర్ ( 24 బంతుల్లో 8 ఫోర్టు, 3 సిక్సర్లతో 54) మెరుపులు వృథా అయ్యాయి. పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.