బుద్ధభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి  

బుద్ధభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని భగవాన్ దాస్ మార్గ్ లో గల బుద్ద భవన్ ఆవరణలో అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రతీ యేడాది అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బుద్ధభవన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతకు ఆటలు, పాటలు, డ్యాన్సుల పోటీలు నిర్వహించి అంబేద్కర్ జయంతి రోజున వారికి బహుమతులు ప్రధానం చేస్తారు. ఇందులో భాగంగానే ఈ యేడాది అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉత్సవాలు బుద్ధభవన్ నిర్వహకులు డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ , ఆయన బాటలో నడిచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన కామ్రేడ్ భగవాన్ దాస్ లను స్మరించుకుని, వారి సేవలను దాస్యం వినయ్ భాస్కర్ ఈ వేదిక ద్వారా కొనియాడారు.బుద్ధభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి  బిఆర్ ఆంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడనిపేర్కొన్నారు. బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. భగవాన్ దాస్ ఈ ప్రాంత దళితుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని చీఫ్ విప్ గుర్తు చేశారు. నగర ప్రజల శ్రేయస్సు కోసం దివంగత కామ్రేడ్ భగవాన్ దాస్ చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు. భగవాన్ దాస్ పోరాటాలు తనకెంతగానో స్ఫూర్తినిచ్చాయని, రాజకీయంగా తాను ఇలాంటి పొజిషన్ లో ఉండటానికి భగవాన్ దాస్ పోరాట స్ఫూర్తి కూడా తనపై ప్రభావం చూపిందని దాస్యం తెలిపారు. భగవాన్ దాస్ కుటుంబసభ్యులతో పాటు, బుద్దభవన్ ప్రజలతో కూడా తనకున్న అనుబంధాన్ని దాస్యం వినయ్ భాస్కర్ నెమరువేసుకున్నారు. బుద్దభవన్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లో అర్హులైన వారికి దళిత బంధు అమలు చేస్తామని దాస్యం వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.బుద్ధభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి  ఈ కార్యక్రమంలో భాగంగా ఆటలు, పాటలు, డ్యాన్సుల పోటీల్లో గెలిచిన చిన్నారులకు, యువతకు నిర్వహకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజన్, జిల్లా రిజిస్ట్రార్ రవి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మాధవీలత, కార్పొరేటర్ శ్రీ మాన్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి, బుద్దభవన్ నిర్వాహకులు డాక్టర్ అంబేద్కర్, స్థానిక ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.