సీపీఐ నారాయణకు సతీ వియోగం 

సీపీఐ నారాయణకు సతీ వియోగం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీపీఐ సీనియర్ నేత , జాతీయ కార్యదర్శి కె. నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయని సీపీఐ నేతలు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సతీమణి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సీపీఐ నారాయణకు సతీ వియోగం వసుమతి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థిగా ఎఐఎస్ ఎఫ్ లో పని చేసి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా పని చేశారని గుర్తు చేశారు. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని కమ్యూనిస్టు పార్టీలో పని చేశారన్నారు. ప్రజాసహకారంతో ప్రారంభించిన 99 టీవీ ఛానల్ ఏర్పాటులో వసుమతి క్రియాశీల పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. కామ్రేడ్ వసుమతి మృతి పట్ల నారాయణకు, వారి కుటుంబసభ్యులకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వసుమతి మృతి పట్ల సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.