విద్యార్థుల కుటుంబాలకు దాస్యం భరోసా

విద్యార్థుల కుటుంబాలకు దాస్యం భరోసా

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : ఉక్రెయిన్ చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆయన భరోసా కల్పించారు.విద్యార్థుల కుటుంబాలకు దాస్యం భరోసారష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు విద్యార్థులు చిక్కుకున్న నేపథ్యంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మంగళవారం నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా ఇళ్ళకు చేరుకునే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కి విన్నవించడంతో తక్షణమే కేటీఆర్ విదేశాంగ మంత్రితో మాట్లాడారని తెలిపారు. వీలయినంత త్వరగా విద్యార్థులు ఇంటికి చేరుకుంటారని కుటుంబ సభ్యులకు దాస్యం వినయ్ భాస్కర్ భరోసా కల్పించారు.