హస్తినకు సీఎం కేసీఆర్

హస్తినకు సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మూడ్రోజులపాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంతో కేసీఆర్ భేటీ..! రేపు ఉదయం సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమవ్వనున్నట్లు సమాచారం. ఈ భేటీ తర్వాత ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు తెలుస్తోంది.హస్తినకు సీఎం కేసీఆర్జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించేందుకు పక్కా ప్లాన్​ చేస్తున్న కేసీఆర్, ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.జాతీయ స్థాయిలో యాక్టివ్​ రోల్​ ప్లే చేసేందుకు కొత్త టీంను రెడీ చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. సినీనటుడు, రాజకీయ నేత ప్రకాశ్ రాజ్‌ను కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన మద్దతు కూడా కూడగట్టారు. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని చెప్పడంతో, ఇప్పుడు ఢిల్లీ సీఎంతో కేసీఆర్ భేటీ చర్చనీయాంశమైంది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.