గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులు

గుడుంబా స్థావరాలపై దాడులువరంగల్ టైమ్స్, మహబూబాద్ జిల్లా : మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్ లో ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. గుడుంబా, సారా స్థావరాలపై దాడి చేశారు. కిరాణా షాపుల్లో గుడుంబా, బెల్లం, మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, 50,000 మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జిల్లాలో నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిషేధిత పదార్థాల అమ్మిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరించారు.