ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్

వరంగల్ టైమ్స్, ముంబై : పబ్లిక్ టాయ్ లెట్ ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకులో పడి మృతి చెందారు. ముంబైలోని ఏక్తా నగర్ లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్ ను శుభ్రం చేయడానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందులో పడిపోయారు. ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్ఊపిరాడకపోవడంతో దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు సెప్టిక్ ట్యాంకులో నుంచి వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.