నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సర్కార్ నేడు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు. సుమారు రూ.2.50 లక్షల కోట్ల మేర బడ్జెట్ ఉంటుందని సమాచారం. ఇందులో వ్యవసాయం, వైద్యారోగ్య, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలకు, సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక కీలక ప్రాజెక్టులకు బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్ లో నియోజకవర్గ నిధి రూపంలో ఒక్కో ఎమ్మెల్యేకి రూ. 2 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించనున్నారు. మరి కాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశమవనుంది. వార్షిక బడ్జెట్ కు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. అనంతరం మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతారు.