తొలి విమానంలో భారత్ కు చేరిన 219 విద్యార్థులు

తొలి విమానంలో భారత్ కు చేరిన 219 విద్యార్థులువరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ 219 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకుంది. రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి మొదటి విమానం బయల్దేరింది. ముంబైలో ల్యాండ్ అయిన ఎయిరిండియా విమానంలో 219 మంది ఇండియన్స్ ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉక్రెయిన్ లో నెలకొన్న భయానక పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న వందలాది మంది భారతీయులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడూ స్వస్థలాలకు సేఫ్ గా తిరిగి వెళ్తామా అని బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. ఎయిరిండియా విమానంలో ఉక్రెయిన్ లోని బుకారెస్ట్ నుంచి తిరిగి స్వదేశానికి తిరిగి చేరుకోవడంతో 219 భారతీయులు ఊపిరిపీల్చుకున్నారు.

ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ దేశీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. భారత్ సైతం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలను చేపట్టింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత పౌరులు, విద్యార్థులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబీసీతో కలిసి ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా ( AI 1944)విమానంలో 219 మంది భారతీయులతో ఈ రాత్రి 8 గంటల సమయంలో ముంబైలో ల్యాండ్ అయింది. భారతీయుల తరలింపును కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత విదేశాంగ బృందాలు, 24 గంటలూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి.