తగ్గేదేలే..సైన్యానికి పుతిన్ ఆదేశం

తగ్గేదేలే..సైన్యానికి పుతిన్ ఆదేశం

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ పై దండయాత్రకు శ్రీకారం చుట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతి చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించినప్పటికీ, ఉక్రెయిన్ ముందుకు రాలేదు. ఈ క్రమంలో పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై దాడులు తీవ్రతరం చేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అన్ని వైపుల నుంచి దాడులు తీవ్రతరం చేయాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రష్యా సైన్యం ప్రయత్నాలు చేస్తున్నది.

తగ్గేదేలే..సైన్యానికి పుతిన్ ఆదేశం

మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా భారీగా సైన్యాన్ని తరలిస్తున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఫోన్ లో మాట్లాడినప్పుడు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పారని చైనా అధికార మీడియా వార్తాకథనం ప్రసారం చేసింది. శాంతియుత పరిష్కారానికి జిన్ పింగ్ సానుకూలంగా ఉన్నారని పేర్కొంది. కానీ శనివారం తాజా పుతిన్ నిర్ణయంతో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.