పేద ప్రజల ఆపద్బాంధవుడు కేసీఆర్: అరూరి

దేశానికే ఆదర్శం తెలంగాణ సంక్షేమ పథకాలు
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి
లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

పేద ప్రజల ఆపద్బాంధవుడు కేసీఆర్: అరూరి

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ ఆపద్బాంధవుడిగా, ఆత్మబంధువుగా నిలుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 215మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. 2కోట్ల 15లక్షల 24వేల 940 విలువ గల చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు. అనంతరం మహిళలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల‌ పుడితే బాధపడే రోజులు పోయాయని ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిరంతరం ప్రజా సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, షాధీముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాల కోసం లక్ష రూపాయలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయలేదని, కేవలం కెసిఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.