క్షమాపణలు చెప్పిన గరికపాటి

క్షమాపణలు చెప్పిన గరికపాటి

వరంగల్ టైమ్స్, అమరావతి : యావత్ విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సమాజానికి ప్రముఖ ప్రవచన కర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహరావు క్షమాపణలు చెప్పారు. విశ్వబ్రాహ్మణుల పై గరికపాటి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, విశ్వబ్రాహ్మణ ధర్మ పీఠం, విశ్వబ్రాహ్మణ మహిళా,యువజన విభాగాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాలు ఆందోళనలు చేసి, పలు పోలీసు స్టేషన్లలో గరికపాటి మీద కేసులు నమోదు చేయడం, ధర్నాలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన గరికపాటి నరిసింహరావు సమస్త విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సమాజానికి క్షమాపణలు చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం పక్షాన ఫిబ్రవరి 24న హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిర్యాదును విశ్వబ్రాహ్మణులు వాపసు తీసుకున్నారు.క్షమాపణలు చెప్పిన గరికపాటివిశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సమాజాన్ని భవిష్యత్తులో కూడా ఎవరూ అవహేళన చేయడానికి వీలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులు సమిష్టిగా స్పందించిన తీరు, వారికి సహకరించిన పోలీసు అధికారులు, రెండు రాష్ట్రాల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు, శ్రేయోభిలాషులకు తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం సభ్యులు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ముఖ్యంగా హిందూ సమాజంలో అసమానతలు తలెత్తే విధంగా ప్రవచనాలు ఉపన్యాసాలు చేస్తున్న మేధావులు గమనించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ లాలుకోట వెంకటాచారి , అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్ మోహన్ , ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు , కోశాధికారి రాగిఫణి రవీంద్రాచారి , తదితరులు పాల్గొన్నారు.