రెండో టీ20లో ఇండియా సూపర్ విక్టరీ

రెండో టీ20లో ఇండియా సూపర్ విక్టరీవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : శ్రీలంకలో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు టీ20 సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నామమాత్రమైన మూడో టీ20 రేపు ధర్మశాల వేదికగానే జరుగనుంది. శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ లకు తోడు సంజూశాంసన్ కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో కేవలం మూడు వికెట్లను కోల్పోయి 17.1 ఓవర్లలోనే 184 రన్స్ లక్ష్యాన్ని చేధించింది. శ్రేయాస్ అయ్యర్ కేవలం 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 బంతుల్లోనే 74 రన్స్ చేశారు. రవీంద్ర జడేజా 18 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 45 రన్స్ చేసి సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. ఇందులో నిస్సంక 53 బాల్స్ లో 75 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ శనక 19 బాల్స్ లో 47 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు, భువనేశ్వర్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.