బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి 

బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో జరిగిన బాంబు దాడిలో భారత విద్యార్ధి మృతి చెందాడు. విద్యార్ధి మృతిని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. భోజనం కోసం బయటికి వెళ్లిన సమయంలో బాంబు దాడి జరిగిందని, ఈ దాడిలోనే విద్యార్ధి చనిపోయినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇతన్ని కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్ధి నవీన్ గా గుర్తించారు.బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి విద్యార్థి మరణాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది భారత్. రష్యా, ఉక్రెయిన్ రాయబారులకు విదేశాంగశాఖ సెక్రటరీ ఫోన్లు చేశారు. తక్షణం భారతీయులంతా సేఫ్ గా బయటకు వచ్చే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఖార్కీవ్ తో పాటు మిగతా నగరాల్లో విద్యార్థులకు , రక్షణ కల్పించాలని విదేశాంగ శాఖ సెక్రటరీ ఆరీందమ్ బాగ్చీ డిమాండ్ చేశారు.