బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్

బీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్.. రూ. 197కే 150 రోజుల వ్యాలిడిటీబీఎస్ఎన్ఎల్ నుంచి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్యాక్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్ విలువ రూ. 197 మాత్రమే. 150 రోజుల కాలపరిమితితో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు అపరిమిత కాల్స్, ఉచిత ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ ప్లాన్ అన్ని సర్కిళ్లలోనూ అందుబాటులో ఉంది.అయితే డేటా, అపరిమిత కాల్స్‌పై మాత్రం పరిమితి ఉంది. రీచార్జ్ చేసుకున్నప్పటి నుంచి తొలి 18 రోజులు మాత్రమే 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఆ తర్వాత మిగతా కాలానికి డేటా స్పీడ్ 40 కేబీపీఎస్‌కు పడిపోతుంది. అయితే, ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రం వస్తుంటాయి. అవుట్ గోయింగ్ కాల్స్ చేయాలనుకుంటే మాత్రం టాపప్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కాలపరిమితి ఉన్నంత వరకు ఉచిత మెసేజ్ సర్వీసు ప్రయోజనాలు మాత్రం అందుబాటులో ఉంటాయి.