త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు 

త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు

వరంగల్ టైమ్స్, భువనేశ్వర్ : బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 5జీ సేవలు అందించడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభించనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 4జీ నెట్ వర్క్ విస్తరణకు సంబంధించి టీసీఎస్, సీ- డాట్ లను షార్ట్ లిస్ట్ చేసినట్లు, ఏడాది తర్వాత ఈ సేవలను 5జీ అప్ గ్రేడ్ చేయాలనుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఒడిషాలో జియో, ఎయిర్టెల్ లకు సంబంధించి 5జీ సేవలను ఆయన ప్రారంభించారు.