ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు..40ని.ల్లోనే ఖాళీ

తిరుమల : ఫిబ్రవరి నెల కోటాకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. ప్రతీ రోజు 12 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను విడుదల చేసింది. అయితే ఇవన్నీ కేవలం 40 నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అవడం విశేషం. ఇక శనివారం ఉదయం 9 గంటలకు టైం స్లాట్ సర్వదర్శన టికెట్లు విడుదల చేయనుంది. రోజుకు 10 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచనుంది. కరోనా కేసుల దృష్ట్యా శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ పరిమితంగానే విడుదల చేస్తుంది.