వైభవంగా శ్రీవారి చంద్రప్రభ వాహన సేవ

వైభవంగా శ్రీవారి చంద్రప్రభ వాహన సేవ

వైభవంగా శ్రీవారి చంద్రప్రభ వాహన సేవ

వరంగల్ టైమ్స్, తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనులపండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. నవనీత కృష్ణుడి అలంకారంలో విశేష తిరువాభరణాలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించారు. బ్రహ్మెత్సవాలకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి కర్పూర హారతులు పట్టారు. వాహన సేవ ముందు కళా బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి.

ఆదివారం ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపుడిగా శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తాలతో రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మరోవైపు సోమవారం బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోనున్నాయి. సోమవారం ఉదయం రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి.