మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు

*భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
*బిఎస్ ఎన్ ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ శ్రీలతమేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారంలో బిఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై సేవలు అందిస్తున్నట్లు వరంగల్ బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్ శ్రీలత తెలిపారు. ఈ నెల 14 నుండి 20 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఇందుకు 20 వైఫై హాట్ స్పాట్స్ ను జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి సిగ్నల్స్ కు తాత్కాలికంగా 2G,3G,4Gఇన్ స్టాల్ చేశామని పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.

లాగిన్ అయ్యే విధానం :
*మీ మొబైల్ ఫోన్ లో వైఫై ఆన్ చేయండి.
*QFI-BSNL-FREE-WIFI@Medaramకు కనెక్ట్ అవ్వండి.
*మీ ఫోన్ లో ఇంటర్నెట్ బ్రౌజర్ తెరవండి.
*వినియోగదారుడి మొబైల్ నెంబర్ నమోదు చేసి Log-inక్లిక్ చేయండి.
*నాలుగు అంకెల పిన్ నంబర్ నమోదు చేయండి, లాగిన్ పేజీలో start Browsing క్లిక్ చేయండి.