పోలీస్ ఆఫీసర్లకు పీపీఎం, పీఎం మెడల్స్

పోలీస్ ఆఫీసర్లకు పీపీఎం, పీఎం మెడల్స్హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, మరో 11 మంది పోలీసులకు పోలీస్ మెడల్స్ లభించాయి. విశిష్ట సేవలందించినందుకు గానూ టీఎస్ఎస్పీ మూడో బెటాలియన్ ( ఇబ్రహీంపట్నం ) కమాండెంట్ చాకో సన్నీకి, పోలీస్ ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్ విభాగంలోని ఐజీపీ ఆఫీస్ లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీ.శ్రీనివాస్ రాజ్ కు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ లభించాయి.

పోలీస్ మెడల్స్ పొందిన అధికారులు..

పుల్ల శోభన్ కుమార్ – ఏఎస్పీ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రాయప్పగారి సుదర్శన్ – ఏఎస్పీ ఇంటెలిజెన్స్, హైదరాబాద్
సంక్రాంతి రవికుమార్ – అడిషనల్ డిప్యూటీ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్, సైబరాబాద్
షాహనవాజ్ ఖాసీం – ఐజీపీ, డైరెక్టర్ ఆఫ్ మైనార్టీస్ వెల్ఫేర్

పొలగాని శ్రీనివాస్ రావు – ( డీఎస్పీ, ఐజీపీ ఇంటెలిజెన్స్ , సెక్యూరిటీ వింగ్
గుడేటి శ్రీనివాసులు – డీఎస్పీ, అడిషనల్ డీజీపీ టెక్నికల్ ఆఫీస్
మహ్మద్ యాకూబ్ ఖాన్ – ఆర్ఎస్ఐ, ఇంటెలిజెన్స్
కేఎం కిరణ్ కుమార్ – డీఎస్పీ, వనపర్తి సబ్ డివిజన్

ఇల్పంద కోటేశ్వర్ రావు – హెడ్ కానిస్టేబుల్, 8వ బెటాలియన్, కొండాపూర్
బెండి సత్యం – అసిస్టెంట్ ఆర్ఎస్ఐ, 7వ బెటాలియన్, డిచ్ పల్లి
మెట్టు వెంకటరమణ రెడ్డి – అసిస్టెంట్ ఆర్ఎస్ఐ, ఏడీజీపీ ఆఫీస్, ఆపరేషన్స్ , గ్రేహౌండ్స్