ఆసియా గేమ్స్ లో భారత్ బోణీ

ఆసియా గేమ్స్ లో భారత్ బోణీ

ఆసియా గేమ్స్ లో భారత్ బోణీవరంగల్ టైమ్స్,స్పోర్ట్స్ న్యూస్: చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్ లో భారత్ తొలి మెడల్ సాధించింది. ఆషి,రమిత, మొహులీ ఘోష్ తో కూడిన మహిళల టీం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. 1896.6 పాయింట్లతో చైనా గోల్డ్ మెడల్ సాధించగా, 1886 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక 1880 పాయింట్లతో మంగోలియా జట్టు కాంస్య పతకం సాధించింది.