ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!

ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!

ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాగల రెండ్రోజుల్లో తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, ములుగు,జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఇదిలా ఉండగా వరంగల్, ములుగు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సూర్యాపేట, నల్గొండతో పాటు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వివరించింది.