క్రీడాకారుడికి సీఎం జగన్ ఆర్థిక సాయం
వరంగల్ టైమ్స్,అమరావతి: విదేశీ టోర్నీలో పాల్గొనేందుకు కోసం ఓ పవర్ లిఫ్టర్ కు సీఎం జగన్ ఆర్థిక సాయం చేశారు.రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే అర్జీ బాలకృష్ణ ప్రతిభావంతుడైన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు.జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించాడు.బాలకృష్ణ ఈ యేడాది డిసెంబరులో మలేసియాలో జరిగే పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించాడు. బాలకృష్ణ 75 కిలోల విభాగంలో పోటీపడుతున్నాడు.అయితే మలేసియా వెళ్లేందుకు ఆర్థిక స్తోమత సహకరించకపోవడంతో ఇటీవల సీఎం జగన్ ను సాయం కోరాడు. వెంటనే స్పందించిన సీఎం జగన్ రూ.2.50 లక్షల సాయం ప్రకటించారు.పవర్ లిఫ్టింగ్ లో బాలకృష్ణ ఘనతలను అభినందించారు. ఆ మేరకు అధికారులు అర్జీ బాలకృష్ణకు సీఎం ఆర్థిక సాయం తాలూకు చెక్ ను అందజేశారు.