హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలుహెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు

వరంగల్ టైమ్స్,ఎడ్యుకేషన్ డెస్క్: బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ నేడు ప్రకటన విడుదల చేసింది. బీఎస్సీ అనేస్తీషియా టెక్నాలజీ,బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ,బీఎస్సీ కార్డియాక్ మరియు కార్డియో వాస్క్యూలర్ టెక్నాలజీ,బీఎస్సీ రెనాల్ డయాలిసిస్ టెక్నాలజీ,బీఎస్సీ ఆప్టోమెట్రీ,బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ,బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ,బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ,బీఎస్సీ రేడియాలజీ మరియు ఇమేజింగ్ టెక్నాలజీ,బీఎస్సీ ఆడియోలజీ మరియు స్పీచ్ థెరపీ టెక్నాలజీ ,బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ తదితర కోర్సులకు ఈ ప్రకటన ద్వారా ప్రవేశం కల్పించనున్నారు.

ఈ నెల 27 నుంచి నవంబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.