విడాకుల పుకార్లపై స్పందించిన సమంత

విడాకుల పుకార్లపై స్పందించిన సమంతహైదరాబాద్ : కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన అక్కినేని కోడలు సమంత విడాకుల పుకార్లపై సామ్ స్పందించింది. ఎప్పుడైతే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అక్కినేని పేరు తొలిగించిందో అప్పటి నుండి అభిమానులలో అనేక అనుమానాలు తలెత్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ సమంత నుంచి చైతూ నుంచి కాని ఎలాంటి స్పందన లేదు.

ఇటీవల ఇంటర్వ్యూలో అక్కినేని పేరు తొలగించడంపై స్పందించమని అడగగా, సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చెబుతానని సామ్ అనడంతో సందేహాలు మరికాస్త పెద్దవయ్యాయి. రోజులు గడిచేకొద్దీ సామ్-చైతన్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్న పుకార్లు మరింత ఎక్కువవుతున్నాయి.

అక్టోబర్ 6న వీరి నాలుగో వివాహ వార్షికోత్సవం. ఆ రోజు ఈ జంట తమ రిలేషన్ కి సంబంధించిన ప్రకటన ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా క్వీన్ సమంత తమపై వచ్చే పుకార్లకు పరోక్షంగా స్పందించింది. మీడియా, రియాలిటీ మధ్య వ్యత్సాసాన్ని చూపిస్తూ.. మేమిద్దరం బాగానే ఉన్నాం. మీడియానే దానిని పెద్దది చేసి చూపిస్తుంది అన్నట్లుగా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది.

ఇటీవల నాగ్ బర్త్ డే రోజు కూడా సమంత చాలా ప్రేమగా తన మామకు శుభాకాంక్షలు తెలిపింది. ఐనప్పటికీ పుకార్లకి బ్రేక్ పడలేదు. సమంత డైరెక్టర్ గా ఈ విషయంపై వివరణ ఇస్తే కాని పుకార్లకి పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు.