సీఎం జగన్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

సీఎం జగన్ కి ఎయిర్ పోర్టులో ఘన స్వాగతంకడప జిల్లా : రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న సీఎం జగన్ కి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కర్నూల్ డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ అన్బురాజన్ లు సీఎం జగన్ కి పుష్ప గృచ్చం అందజేసి స్వాగతం పలికారు.

అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ ఎస్టేట్ కు బయలుదేరి వెళ్లారు. సీఎంతో పాటు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజులు ఇడుపులపాయకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. సీఎంని కలిసిన వారిలో ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, కత్తి నరసింహారెడ్డి, రమేష్ యాదవ్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, దివంగత బద్వేలు ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య సతీమణి డా.సుధా, తదితర నాయకులు వున్నారు.

సీఎం జగన్ కి స్వాగతం పలికిన వారిలో పద్మశాలీ కార్పొరేష న్ చైర్మెన్ విజయలక్ష్మి, దేకుల కార్పొరేష న్ చైర్మెన్ ఫకుర్బిన్, సగర ఉప్పర కార్పొరేష న్ చైర్మెన్ గానుగపెంట రమణమ్మ, యాదవ కార్పొరేష న్ చైర్మెన్ హరీష్, సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మెన్ పులి సునీల్, నాయీబ్రాహ్మణ కార్పొరేష న్ చైర్మెన్ యానాదయ్య, అడా ఛైర్మెన్ గురుమోహన్ తదితర రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ కార్పొరేషన్ల చైర్మన్లు వున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గౌతమి, సబ్ కలెక్టర్లు పృద్వితేజ్, కేతన్ గార్గ్, సహాయ కలెక్టర్ కార్తీక్, కడప నగరపాలక సంస్థ కమీషనర్ రంగస్వామి తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.