తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణం : సీతక్క

 


తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణం : సీతక్కములుగు జిల్లా :
తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ములుగుజిల్లా వెంకటాపూర్ మండలం రామాజా పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయకుండా తాలు ,మచ్చ పేరుతో క్వింటకు 5 కేజీల చొప్పున కట్ చేస్తున్న పరిస్థితులు నెలకొనడం ప్రభుత్వ పాలనా తీరుకు సిగ్గచేటని సీతక్క విమర్శించారు. ఒక దిక్కు బర్ధన్ కొరత మరో పక్క వడ్లు కాంటాలై లారీలు లేక ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కై 40కేజీ ల బస్తాకు 2కేజీ లు కాంటా తక్కువ చూపించడం సరైంది కాదని ఈ సమావేశంలో హెచ్చరించారు. రైతులకు లారీ లు సమకూర్చే కాంట్రాక్టర్ రైతులకు లారీలను సమకూర్చకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వెంటనే సంబంధిత కాంట్రాక్ట్ రు పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటల పై ప్రభుత్వ ఆంక్షలు విధించడంతో తగదని భూములకు అనుగునంగా రైతులు పంటలు వేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరారు. ముఖ్య మంత్రి ఫాం హౌస్ లో పండించిన పంటలు ములుగు నియోజకవర్గంలో పండించలేరని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లడి రాంరెడ్డి, మండల అధ్యక్షులు చెన్నోజు తదితరులు పాల్గొన్నారు.