దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదున్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,4260,470కి చేరాయి. ఇందులో 3,36,41,175 మంది కోలుకోగా 1,61,555 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మరో 4,57,740 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 7,722 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మరో 47 మంది కరోనాకు బలయ్యారు. ఇత గత 24 గంటల్లో 13,543 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడగా, 549 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.19 శాతం ఉన్నదని, యాక్టివ్ కేసులు 0.47 శాతం మాత్రమే ఉన్నాయని తెలిపింది.