హనుమకొండలో సిక్స్ కొట్టిన హరీశ్ రావు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే ను పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారథ్యంలో 6 రోజుల పాటు నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ టోర్నీ నేడు ప్రారంభమైంది. హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో జరుగనున్న ఈ పోటీలను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ప్రారంభించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బౌలింగ్ లో మంత్రి హరీశ్ రావు బ్యాటింగ్ చేసి ఈ పోటీలను ప్రారంభించారు.ప్రారంభంలోనే బ్యాటింగ్ తో సిక్స్ కొట్టిన హరీశ్ రావు టోర్నీలో పాల్గొన్న యువతను మరింత ఉత్సాహపరిచారు. హనుమకొండలో సిక్స్ కొట్టిన హరీశ్ రావు

అనంతరం గ్రౌండ్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కాసేపు క్రికెట్ ఆడారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బౌలింగ్ చేయగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బ్యాటింగ్ చేసి టీఆర్ఎస్వీ నాయకులను, యువతను ఉత్సాహపరిచారు.

హనుమకొండలో సిక్స్ కొట్టిన హరీశ్ రావుయువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకే కేసీఆర్ క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీ యేటా కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న టీఆర్ఎస్వీ నాయకులను, కాకతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఎండీ ఫారుఖ్ అలీని మంత్రులు అభినందించారు. పోటీలను విజయవంతంగా ఆడి, ట్రోఫీలను సొంతం చేసుకోవాలని ఇరు జట్లకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. హనుమకొండలో సిక్స్ కొట్టిన హరీశ్ రావుఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, డివిజన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం టీఆర్ఎస్వీ నాయకులకు, యువతకు మంత్రులు సెల్ఫీలకు ఫోజులిచ్చారు.

కాకతీయ క్రీకెట్ అకాడమీ సహకారంతో నేటి నుంచి ఫిబ్రవరి 16 వరకు జరిగే ఈ టోర్నీలో 45 టీంలు పాల్గొంటాయని కాకతీయ క్రీకెట్ అకాడమీ నిర్వహకులు, చైర్మన్ ఫారుఖ్ అలీ తెలిపారు. మొత్తం మూడు గ్రౌండ్లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు మూడు మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నీలో గెలిచిన జట్లకు మొదటి బహుమతి రూ.75 116, రెండవ బహుమతికి రూ. 35116 ఫ్రైజ్ మనీతో పాటు ట్రోఫీ అందచేయనున్నట్లు ఫారుఖ్ అలీ వెల్లడించారు.