స్పందించిన కార్పొరేటర్ మామిండ్ల రాజు

స్పందించిన కార్పొరేటర్ మామిండ్ల రాజు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని 31డివిజన్ హంటర్ రోడ్ లోని మెయిన్ రోడ్ లో మిషన్ భగీరథ కలెక్షన్లను ఇంకా ఇవ్వకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యలను 31వ డివిజన్ ప్రజలు స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ మామిండ్ల రాజు మిషన్ భగీరథ ఇన్చార్జి క్రాంతితో మాట్లాడారు. ఇట్టి సమస్యను నేరుగా చూపించేందుకు కార్పొరేటర్ మామిండ్ల రాజు మిషన్ భగీరథ ఇన్చార్జి క్రాంతితో కలిసి డివిజన్ లో పర్యటించారు. పైపులైన్లు వీలైనంత త్వరగా వేయాల్సిందిగా కోరారు. కాలనీవాసులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నాణ్యతతో కూడుకున్న కలెక్షన్లు ఇవ్వాల్సిందిగా ఇన్చార్జిని కోరారు. దీనికి స్పందించిన మిషన్ భగీరథ ఇన్ఛార్జి కాలనీ వాసులకు ఇబ్బంది కలవకుండా త్వరలోనే మిషన్ భగీరథ కలెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.