ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ చర్చలు సఫలం

ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ చర్చలు సఫలంవరంగల్ టైమ్స్, అమరావతి: ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల సాధనకు ప్రభుత్వం అన్ని విధాలా సానుకూలంగా స్పందించిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫిబ్రవరి చివరికల్లా సమస్యలు పరిష్కారమై జీఓలో విడుదల అవుతాయని వెల్లడించారు. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానితో చిరంజీవి, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్.నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్ రెడ్డి, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

చిన్న సినిమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్రంలో ఐదో షోకు అంగీకరించడం శుభపరిణామని పేర్కొన్నారు. వైజాగ్ లో పెద్ద ఎత్తున షూటింగ్ లు చేపట్టాలని సీఎం కోరడం అందుకు ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

సీఎంతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరిగాయని వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డుపడిందని చెప్పడానిక సంతోషిస్తున్నామని చిరంజీవి వెల్లడించారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు రావడాన్ని సీఎం జగన్ అభినందించారని చెప్పారు. పెద్ద సినిమాల ప్రదర్శనలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.