ఐపీఎస్ తో నటి డింపుల్ హయతి వివాదం

ఐపీఎస్ తో నటి డింపుల్ హయతి వివాదం

ఐపీఎస్ తో నటి డింపుల్ హయతి వివాదంవరంగల్ టైమ్స్,హైదరాబాద్ : టాలీవుడ్ నటి డింపుల్ హయతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారుని పార్కింగ్ ప్లేస్ డింపుల్ హయతి కాబోయే భర్త డేవిడ్ ఢీకొట్టాడు.అనంతరం డింపుల్ హయతి ఐపీఎస్ కారును కాలుతో తన్నడం కలకలం రేపుతోంది.డింపుల్ హయతి, కిలాడీ, రామబాణం లాంటి సినిమాల్లో నటి. కానీ నిజ జీవితంలో ఆమె రెచ్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. నటిని కదా సినిమాల్లోలా ఏం చేసినా చెల్లుతుందనుకుంది.

ఏకంగా ఐపీఎస్ అధికారినే బెదిరించే స్థాయికి చేరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సినీ ఫక్కీలో హీరోయిజం చెలాయించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.కార్ పార్కింగ్ విషయంలో డీసీపీ మరియు హీరోయిన్ డింపుల్ హయతి మధ్య వివాదం ముదురింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా తీవ్రస్థాయికి చేరాయి.అయితే హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో నటి డింపుల్ హయతి,ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.

పార్కింగ్ ప్లేస్ లో ఉన్న రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టి ప్రతాపం చూపించాడు డింపుల్ హయతి ప్రియుడు డేవిడ్.ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో డింపుల్ సంయమనం కోల్పోయి ఐపీఎస్ అధికారి వాహనంపై దాడి చేసి కాలితో పదే పదే కొట్టడం,ఆయనను దూషించడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది.డింపుల్ హయతికి ఐపీఎస్ అధికారి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె పదేపదే వాహనంపై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో నమోదయ్యాయి. దీంతో పోలీస్ అధికారి రాహుల్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై డింపుల్ హయతిపై ఐపీసీ సెక్షన్లు 341,379,350 కింద కేసులు నమోదు చేశారు.ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో హీరోయిన్ డింపుల్ హయతి గొడవకు ఆమె ప్రియుడు కారణమని తెలుస్తోంది.పార్కింగ్ ప్రదేశంలో ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టింది.దానిని ప్రశ్నించడంతో రుబాబు ప్రదర్శిస్తూ కాలితో తన్నినట్లు తెలుస్తోంది.డింపుల్ గతంలో కూడా పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ హెగ్డే తెలిపారు.నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె తీరు మార్చుకోలేదని చెబుతున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాహుల్ వెల్లడించారు.

అయితే ఇదిలా ఉండగా డింపుల్ హయతి మాత్రం ఇదంతా అబద్దమని చెబుతుంది.ఐపీఎస్ అధికారి కారును తన వాహనం ఢీకొడితే తన వాహనం కూడా డ్యామేజీ అయి ఉండాలి కదా అని ప్రశ్నించింది.పార్కింగ్ ప్లేస్ లో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తే తప్పు ఎవరిదనేది తెలుస్తుంది కదా అని డింపుల్ ఓ మీడియా ప్రశ్నించిన దానికి సమాధానం ఇచ్చింది.అంతేకాదు ఐపీఎస్ అధికారి అయినంత మాత్రాన నిందలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అంటోంది.తన వైపు తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని డింపుల్ హయతి ధీమా వ్యక్తం చేస్తోంది.