మేడారంలో..జ్ఞాపకాలు నెమరేసుకున్న సీతక్క

మేడారంలో..జ్ఞాపకాలు నెమరేసుకున్న సీతక్కవరంగల్ టైమ్స్ , ములుగు జిల్లా : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర విశేషాలను తన చిన్ననాటి జ్ఞాపకాలతో నెమరేసుకుంది ములుగు ఎమ్మెల్యే సీతక్క. కాకతీయ రాజులతో వనదేవతల కుటుంబమైన సమ్మక్క, సారలమ్మ , పగిడిద్దరాజు, గోవిందరాజులు, జంపన్నల సాహసోపేత పోరాటం, వారు చేసిన త్యాగాలను సీతక్క వివరించారు. వీరవనితలైన సమ్మక్క, సారలమ్మలు పోరాట పటిమతో పాటు, మహిమగలవారని తెలిపారు. తమ కుటుంబంలోని ప్రతీ ఒక్కరి పేరు సమ్మక్క, సారలమ్మ పేర్లు కలిసేలా ఉంటాయని, వనదేవతలపై తమ కుటుంబానికి ఉన్న నమ్మకం, భక్తి, విశ్వాసాన్ని సీతక్క గుర్తు చేశారు.

మేడారం గద్దెల విశిష్టత, వనదేవతలు పోరాటం చేసే సమయంలో మంచెను ఉపయోగించిన తీరు, తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు జాతరలో అభివృద్ధి దిశగా మారిన పరిస్థితులను సీతక్క వివరించారు. అంతేకాకుండా ఇంటి బిడ్డగా, గిరిజన బిడ్డగానే కాకుండా, ఒక ప్రజాప్రతినిధిగా మేడారం జాతరకు జాతీయ హోదాకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. దీనికోసం జాతరకు సంబంధించిన పలు అంశాలపై ఒక కమిటీని నియమించి, వారి ద్వారా అభిప్రాయాలు సేకరించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.