శ్రీశైలం శివరాత్రి వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం

వరంగల్ టైమ్స్, అమరావతి : శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు హాజరై, స్వామి ఆశీర్వచనం అందుకోవాలని శ్రీశైలం దేవస్థానం ప్రతినిధులు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు ఆహ్వానం అందించారు. దేవస్థానం ఈవో లవన్న, ఇతర అధికారులు శుక్రవారం గవర్నర్ ను రాజ్ భవన్ లో కలిసి ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు గౌరవ గవర్నర్ ను ఆశీర్వదించి ప్రసాదాలు, దేవతామూర్తుల చిత్ర పటాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తదితరులు పాల్గొన్నారు.