వరంగల్ టైమ్స్, నాగర్ కర్నూల్ జిల్లా: తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన అరవింద్(25), శిరీషా(23), కిరణ్మయి(20)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Home Crime