ఫాదర్స్ డే జరుపుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ జిల్లా: అమ్మంటే మెరిసే మేఘం, కురిసే వాన.. నాన్నంటే నీలాకాశం తలవంచేనా….ఆయన విశాల హృదయానికి నీలాకాశం కూడా తలవంచాల్సిందే..అందుకే నాన్నంటే ఫాదర్స్ డే జరుపుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ఓ నమ్మకం..నాన్నంటే అద్భుతమైన పెంపకం…ఆ నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు తన స్వగ్రామం పెద్దతండాలో తల్లిదండ్రుదల వద్దకు వెళ్లి కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. గుగులోత్ లింగ్యా నాయక్, దస్మి దంపతులకు కిషన్ నాయక్, లక్ష్మీ బాయి, కాంతిబాయి, శారదా బాయి, సత్యవతి రాథోడ్ లు ఐదుగురు సంతానం. మంత్రి తల్లిదండ్రులు లింగ్యానాయక్, దస్మిలు పెద్ద తండాలోనే నివసిస్తారు. సోదరుడు కిషన్ నాయక్ వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, సోదరి శారద, సోదరుడు కిషన్ నాయక్ లు కలిసి తల్లిదండ్రులను కోర్చోబెట్టి కేక్ కట్ చేసి వేడుక జరిపారు. మంత్రితో పాటు మనుమరాలు అయిన జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.