ఒక్కరోజే 730 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 730 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల మరో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,802కు చేరింది. కరోనా బారినపడి ఇప్పటి వరకూ 210 మంది మరణించారు. ప్రస్తుతం 3,861 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి వరకు 3,731 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.ఒక్కరోజే 730 కరోనా పాజిటివ్‌ కేసులుజీహెచ్‌ఎంసీ పరిధిలోనే 659 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జనగామ(34), రంగారెడ్డి(10), మేడ్చల్‌(9), ఆసిఫాబాద్‌(3), సంగారెడ్డి(1), ఆదిలాబాద్‌(1), కొత్తగూడెం(1), నారాయణపేట్‌(1), మెదక్‌(1), నల్గొండ(1), వికారాబాద్‌(2), వరంగల్‌(6), యాదాద్రి(1) జిల్లాల్లో ఇవాళ కేసులు నమోదయ్యాయి.