కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ఆదివారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన పీకే.. కేసీఆర్‌ని కలిసి తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐప్యాక్‌ టీమ్‌ తెలంగాణకు వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్న కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌ టీమ్‌తో కలిసి పనిచేయనున్నట్టు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌‌తో ప్రశాంత్ కిషోర్ భేటీఈ నేపథ్యంలోనే పీకే, కేసీఆర్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై పీకే టీమ్ రిపోర్టు రూపొందించనున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ఆ బృందం పర్యటించనుంది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది.

మరోవైపు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ శనివారం కూడా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరు జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు తదితర అంశాలపై సుమారు నాలుగు గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే పలు దఫాలు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లతో సమావేశమయ్యారు. ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌లతో భేటీ కోసం కేసీఆర్‌ ముంబయి వెళ్లగా… అక్కడ కూడా ఆయన మెరిశారు. తాజాగా కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రకాశ్‌రాజ్‌ ఎర్రవల్లికి వచ్చి ఆయనను కలిశారు.