సచిన్ టెండూల్కర్ దోస్త్ అరెస్ట్

సచిన్ టెండూల్కర్ దోస్త్ అరెస్ట్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : టీంఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీని ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ముంబైలోని బంద్రాలో గల తన రెసిడెన్షియల్ సొసైటీ గేటు మీదుగా కారు నడిపించినందుకు కేసు నమోదైంది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ వాచ్ మెన్, కొందరు నివాసులతో వాగ్వాదానికి దిగాడన్న ఆరోపణలున్నాయి. వినోద్ కాంబ్లీపై ఐపీసీలోని 279, 336, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బంద్రా పోలీసులు తెలిపారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు వినోద్ కాంబ్లీ అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.సచిన్ టెండూల్కర్ దోస్త్ అరెస్ట్