లంకపై భారత్ గెలుపు..సిరీస్ కైవసం

లంకపై భారత్ గెలుపు..సిరీస్ కైవసం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : శ్రీలంకతో టీ-20 సిరీస్ ను టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన మూడో టీ-20 మ్యాచ్ లోనూ విజయం సాధించింది. కేవలం 14.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 147 పరుగుల విజయ లక్ష్యాన్ని టీంఇండియా చేధించింది. దీంతో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టీంఇండియా బ్యాట్స్ మన్లలో శ్రేయాస్ అయ్యర్ 73 పరుగులతో రాణించగా, రవీంద్ర జడేజా 22, సంజూ శాంసన్ 18, దీపక్ హుడా 17 పరుగులు చేశారు. లంకపై భారత్ గెలుపు..సిరీస్ కైవసంశ్రీలంక బౌలర్లలో లహీర్ కుమార రెండు వికెట్లు, కరుణ రత్నే, చమీర చెరో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 20 ఓవర్లకు 146 పరుగులు చేసింది. శ్రీలంకను కెప్టెన్ శనక ఆదుకున్నాడు. 38 బంతుల్లో 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దినేష్ 22, చమికా కరుణారత్నే 12 రన్స్ చేశారు. టీంఇండియా బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.