పేలిన ల్యాప్ టాప్ ఉద్యోగినికి తీవ్ర గాయాలు

పేలిన ల్యాప్ టాప్ ఉద్యోగినికి తీవ్ర గాయాలు

వరంగల్ టైమ్స్, వైఎస్‌ఆర్‌ జిల్లా : బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో ల్యాప్‌ట్యాప్‌ పేలింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుమతి తన ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్‌ పెట్టి వర్క్‌ చేస్తుండగా ఉన్నట్టుండి అది పేలడంతో మంటలు వచ్చాయి. పేలిన ల్యాప్ టాప్ ఉద్యోగినికి తీవ్ర గాయాలుఈ ఘటనలో సుమతి తీవ్రంగా గాయపడటంతో ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో ల్యాప్‌ట్యాప్‌ పేలిన విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.